Home  »  TV News  »  Illu illalu pillalu : ప్రేమకి ఎస్ఐ హాల్ టికెట్.. సాగర్ కి గవర్నమెంట్ జాబ్!

Updated : Feb 10, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu Illalu pillalu ). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -390 లో.... సాగర్ అప్పాయింట్ మెంట్ లెటర్ తీసుకొని వస్తాడు. రాగానే హాల్లో రామరాజు ఉండడంతో లెటర్ ని సాగర్ జేబులో పెడుతాడు. ఎంట్రా నాన్న డిశ్చార్జ్ అయేటప్పుడు లేవని వేదవతి కోప్పడుతుంది. మిల్ పని మీద వెళ్లానని సాగర్ అనగానే అయ్యో అవునా అని వేదవతి అంటుంది. నాన్న ఇప్పుడు మీకెలా ఉందని సాగర్ అడుగుతాడు. ఇప్పుడు బాగుంది రా.. మొన్న వనజ ఇచ్చిన ఇరవై లక్షలు బ్యాంకులో వెయ్యమని చెప్పాను కదా.. అవి వేసావ్ కదా అని రామరాజు అనగానే సాగర్ టెన్షన్ పడుతూ ఆ వేసాన్ నాన్న అని అంటాడు. అదే వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇవ్వాలి కదా నేను తీసుకొని రమ్మన్నప్పుడు తీసుకొని రా అని రామరాజు చెప్తాడు. సరే అని సాగర్ లోపలికి వెళ్తాడు. సాగర్ జేబులో లెటర్ చూసి ఏంటి అది అని నర్మద అనుకుంటుంది.

మరొకవైపు ప్రేమకి వచ్చిన ఎస్ఐ హల్ టికెట్ ఎక్కడ దాచాలని ప్రేమ రూమ్ లో అటు ఇటు తిరుగుతుంది. అది ధీరజ్ చూసి ఏంటి అప్పటినుండి అటు ఇటు తిరుగుతున్నావని చేతిలో ఉన్న పేపర్ లాక్కుంటాడు. అది చూసి ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నువ్వు ఎగ్జామ్ రాయాలి.. మరి ఎందుకు దాస్తున్నావని అడుగుతాడు. మావయ్య ఆ పరిస్థితిలో ఉండగా ఆయనకి ఇష్టం లేని పని నేను చెయ్యనని ప్రేమ అంటుంది. అదేం కాదు ఇది నీ డ్రీమ్.. నువ్వు బాగా ప్రిపేర్ అయి రాయలని ధీరజ్ మోటివేట్ చేస్తాడు. ప్రేమ నుదిటిపై ముద్దు పెట్టి.. నువ్వు ఎగ్జామ్ రాయాలని చెప్తాడు. దాంతో ప్రేమ మురిసిపోతుంది.

మరొకవైపు నర్మద, సాగర్ మాట్లాడుకుంటారు. తనకి గవర్నమెంట్ జాబ్ వచ్చిన విషయం సాగర్ చెప్పగానే నర్మద హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు తెలియకుండా ఎప్పుడు అప్లై చేసావని నర్మద అడుగుతుంది. చేసానని కవర్ చేస్తాడు. ఈ విషయం ఇంట్లో చెపుదామని నర్మద అనగానే వద్దని సాగర్ చెప్తాడు. ఇప్పుడు ఆ వనజకి డబ్బు ఇవ్వాలా అని సాగర్ అనగానే మావయ్య గారు చెప్పారు కదా ఇవ్వాలని నర్మద అంటుంది. ఆ తర్వాత అమూల్యని గుర్తు చేసుకొని వేదవతి నిద్రలో ఒక్కసారిగా ఉలిక్కిపడుతుంది. అమూల్య గురించి రామారాజు బాధపడుతుంటే.. అప్పుడే వేదవతి వస్తుంది. ఇద్దరు అమూల్య గురించి మాట్లాడుకుంటారు. మరుసటి రోజు ప్రేమ, నర్మద ఇద్దరు మాట్లాడుకుంటారు. సాగర్ కి జాబ్ వచ్చిందని ప్రేమకి నర్మద చెప్తుంది. తనకి ఎస్ఐ హాల్ టికెట్ వచ్చిందని నర్మదతో ప్రేమ చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.